: చంద్రబాబును కలిసిన మంద కృష్ణ... జూపూడిని చేర్చుకోవడంపై అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా, మాల మహానాడు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావును టీడీపీలో చేర్చుకోవడంపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో జూపూడి చేరినప్పటికీ... మాదిగలకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చంద్రబాబుకు విన్నవించారు.