: నకిలీ జీవోలతో టోపీ పెట్టిన ఘరానా మోసగాళ్ల అరెస్టు
నకిలీ జీవోలతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాళ్ల కేసులో హైదరాబాదు పోలీసులు పురోగతి సాధించారు. నకిలీ జీవోలు సృష్టించి మోసం చేసిన కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు దళారులను హైదరాబాదు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో వారికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.