: కౌగిలించుకోండి... ఒత్తిడి తగ్గిపోతుంది


ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషి జీవితం బిజీబిజీగా మారిపోయింది. క్షణం తీరిక లేని లైఫ్ తో చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటి వారి కోసం చిన్న చిట్కా ఉంది. అమితంగా ఇష్ట పడేవారిని లేదా ప్రేమించే వారిని హత్తుకుంటే చాలు... ఒత్తిడి మటుమాయం అవుతుంది. సైకలాజికల్ సైన్స్ క్లెయిమ్స్ జర్నల్లోని ఓ పరిశోధన వ్యాసంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మానవ సంబంధాలను ఆత్మీయంగా కొనసాగించేవారు నిరాశ నిస్పృహలను దరి చేరనివ్వరని, అనారోగ్యానికి దూరంగా ఉంటారని పరిశోధనా వ్యాసం చెబుతోంది. ఎప్పుడూ గొడవ పడేవారు దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోలేరని తెలిపింది.

  • Loading...

More Telugu News