: రెండేళ్లలో ఢిల్లీ అంతటా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు: వెంకయ్యనాయుడు
దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రెండు సంవత్సరాల్లోగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తరువాత దేశమంతటా కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలోని నారాయణ విహార్ లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని మాట్లాడారు. వీధి దీపాల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంవల్ల 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలపై మండిపడ్డ ఆయన, మోదీ ప్రధాని కావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.