: భారత్-మయన్మార్ బోర్డర్లో శక్తిమంతమైన బాంబును గుర్తించిన భద్రతా బలగాలు


భారత్-మయన్మార్ సరిహద్దుల్లో శక్తిమంతమైన బాంబును అస్సామ్ రైఫిల్స్ బలగాలు గుర్తించాయి. మణిపూర్ లోని చందేల్ జిల్లా మోరే పట్టణం వద్ద అస్సామ్ రైఫిల్స్ పోస్టుకు సమీపంలో లభ్యమైన ఈ బాంబు 3 కిలోల బరువుంది. ఈ బాంబును మిలిటెంట్లు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న అస్సామ్ రైఫిల్స్ బెటాలియన్ సిబ్బంది ఈ బాంబును గుర్తించి, అనంతరం దాన్ని నిర్వీర్యం చేశారు. కాగా, మోరే పట్టణం భారత్, మయన్మార్ దేశాల మధ్య వాణిజ్యానికి కీలకప్రాంతంగా ఉంది.

  • Loading...

More Telugu News