: ఏఎన్ఆర్-2014 పురస్కారానికి అమితాబ్ బచ్చన్ ఎంపిక
ప్రముఖ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు-2014 పురస్కారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. ఈ నెల 27న అవార్డును బిగ్ బీకి ప్రదానం చేయనున్నట్టు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరవనున్నారు. సినీ నటి, శాస్త్రీయ నృత్య కళాకారిణి అయిన శోభన ఈ కార్యక్రమంలో నృత్యం చేయనున్నారు.