: టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయా?
అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయినట్టు తెలుస్తోంది. దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ కీలక నేత, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బొత్తిగా కనపించడమే లేదు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా కచ్చితంగా కనిపించే వ్యక్తి కేటీఆర్. అలాంటిది, మంత్రి వర్గ విస్తరణ సమయంలో కాని, అనంతరం జరిగిన కేబినెట్ సమావేశాలకు కాని, చివరకు కరీంనగర్ జిల్లాకే చెందిన కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి కానీ కేటీఆర్ హాజరు కాలేదు. దీంతో, పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని, లుకలుకలు ప్రారంభమయినట్టున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.