: దెబ్బకు దెబ్బ తీసిన పాకిస్తాన్... సైనిక స్కూల్ పై దాడి సూత్రధారి ఫజులుల్లా హతం
పాకిస్తాన్ సైన్యం దెబ్బకు దెబ్బ తీసింది. పెషావర్ లోని సైనిక స్కూల్ పై దాడి చేసి సుమారు 150 మంది అమాయక చిన్నారులను క్రూరాతిక్రూరంగా పొట్టన పెట్టుకున్న ఘటనలో ప్రధాన సూత్రధారి తెహ్రీక్-ఏ-తాలిబాన్ అధినేత ఫజులుల్లా హతమైనట్టు తెలుస్తోంది. నేటి ఉదయం తాలిబాన్ స్థావరాలపై సైన్యం జరిపిన దాడిలో ఆయన మరణించినట్టు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.