: బాలుడి కడుపులో కిలో రాళ్లు... ఆపరేషన్ లేకుండా తొలగించిన వైద్యులు
పదేళ్ళ వయసున్న బాలుడి కడుపులో నుంచి కిలోకు పైగా బరువున్న రాళ్ళను ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు బయటకు తీశారు. పానగల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డికి మలంలో రాళ్లు వస్తున్నాయని ఆసుపత్రికి రాగా, ఎక్స్ రే తీసి చూశారు. బాలుడి కడుపులో చాలా రాళ్లు ఉండడాన్ని గమనించి ఆపరేషన్ లేకుండా ప్రయత్నించి చూసి సఫలమైనట్టు డాక్టర్లు తెలిపారు. రక్తహీనతతో (ఎనీమియా) బాధపడుతున్న నవీన్ గత రెండు సంవత్సరాల నుండి రాళ్లను తింటూ వచ్చాడని వివరించారు. ఎనీమియా వున్న వాళ్ళు మట్టి, రాళ్ళను తింటూ వుంటారు.