: ప్చ్... రెండో టెస్ట్ కూడా పోయినట్టే... 128 కొడితే ఆస్ట్రేలియాకు విజయం!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్సులో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, భారత్ ఆధిక్యం 127 పరుగులు కాగా, ఆస్ట్రేలియా కేవలం 128 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా మరో ఓటమి ముంగిట ఉన్నట్టే. మన బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఓటమి నుంచి బయట పడలేరు! భారత్ రెండవ ఇన్నింగ్సులో ధావన్ 81 పరుగులు చేయగా, ఐదుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్ ను కూడా చేరుకోలేకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ, ధోనీ డకౌట్ అయ్యారు.