: హైదరాబాదు శివార్లలో అశ్లీల నృత్యాలు... పోలీసుల దాడి


హైదరాబాదు శివారు ప్రాంతం మొయినాబాద్ లోని ఓ ఫాం హౌస్ పై పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 20 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం, హుక్కా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మొయినాబాద్ లోని ఫాం హౌస్ లలో తరచు అశ్లీల నృత్యాలు, తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫాం హౌస్ యాజమాన్యాలను పోలీసులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News