: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు దుర్మరణం


కర్నూలు జిల్లాలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ లారీ బోల్తా పడింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా, 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మహానంది మండలం చింతమావి మలుపు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గేర్ రాడ్ సరిగా పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, వధూవరులు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News