: రెండో వికెట్ తీసిన స్టార్క్... ఆరో వికెట్ కోల్పోయిన భారత్


బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఓటమి ప్రమాదంలో పడింది. జాన్సన్ కు తోడు మిచెల్ స్టార్క్ కూడా పదునైన బంతులు విసరడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ విజయ్ వికెట్ తీసిన స్టార్క్... నాలుగో రోజు ఆటలో క్రీజులో కుదురుకుంటున్న ఆల్ రౌండర్ అశ్విన్ (19)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో, టీమిండియా 117 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పుజారా (43 బ్యాటింగ్), ధావన్ (34 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ ఆధిక్యం 44 పరుగులు కాగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

  • Loading...

More Telugu News