: 'జబర్దస్త్' కార్యక్రమంపై గౌడ విద్యార్థి సంఘం ఫిర్యాదు


ఈ-టీవీలో ప్రసారమయ్యే మిక్కిలి ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షో 'జబర్దస్త్' పై గౌడ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది . ఈ నెల 18న రాత్రి 9.30 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ కల్లుగీత కార్మికులను, గౌడ మహిళలను కించపరిచేలా ఉందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. 'జబర్దస్త్' టీం, న్యాయనిర్ణేతలతో పాటు ఈ-టీవీ యాజమాన్యంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. అన్ని అంశాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News