: కాసేపట్లో వందిమాగధులతో టీడీపీలో చేరనున్న జూపూడి
మాలమహానాడు నేత జూపూడి ప్రభాకర్ మరికాసేపట్లో టీడీపీలో చేరనున్నారని సమాచారం. వైఎస్సార్సీపీలో కీలక పాత్ర పోషించిన జూపూడి ప్రభాకర్ అధినేత వ్యవహారశైలిపై కినుక వహించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. బాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, సుమారు వంద మంది వరకు మాల మహానాడు నేతలు టీడీపీలో చేరనున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కాపాడుకునేందుకు జూపూడి టీడీపీలో చేరుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.