: హైదరాబాదులో 11 స్కైవేలు ఇవిగో!


హైదరాబాదు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు హైదరాబాదులో 11 స్కైవేలు నిర్మించాలని అన్నారు. పలు చోట్ల ఎలివేటర్లు, కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ప్రదేశాల ఎంపిక కోసం చర్చించారు. హరిహర కళాభవన్ నుంచి ఉప్పల్, మాసబ్ ట్యాంక్ నుంచి హరిహరకళాభవన్ కు, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ కు, తార్నాక నుంచి ఈసీఐఎల్ కు, చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ మార్గాల్లో ఈ 11 స్కైవేలు నిర్మించాలని ఆయన ఆదేశించారు. మధ్యలో మెట్రో రైలు మార్గం అడ్డం వస్తే దాని మీదుగా స్కై వే నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News