: బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ నన్ను కిడ్నాప్ చేశారు: సింగర్ క్రిస్ మార్టిన్


హాలీవుడ్ సూపర్ స్టార్ దంపతులు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ తనను కిడ్నాప్ చేశారని సింగర్ క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఏంజెలీనా జోలీ దర్శకత్వం వహిస్తున్న 'అన్ బ్రోకెన్' సినిమాకు బ్రాడ్ పిట్ రాస్తున్న పాటకోసం తనను కిడ్నాప్ చేశారని మార్టిన్ తెలిపాడు. అన్ బ్రోకెన్ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశంను తనకు మెసేజ్ చేశారని చెప్పాడు. తన తలపై కొట్టడమే కాకుండా, ముఖంపై స్ప్రే చేశారని, తరువాత తాను ఆఫీస్ లో ఉన్నానని, అక్కడ బ్రాడ్ పిట్ ఎక్సర్ సైజులు చేస్తుండగా, జోలీ భర్త ముందు కూర్చుని ఉందని అన్నాడు. తన పీకపై కత్తిపెట్టి ఓ మనిషి కూర్చున్నాడని వివరించాడు. ఇప్పుడో పాట రాస్తున్నామని, అది విని అభిప్రాయం చెప్పాలని, అందుకే కిడ్నాప్ చేశామని చెప్పారని క్రిస్ మార్టిన్ తెలిపాడు. ఇదంతా సరదా కోసం చేశారని, తమ మధ్య అంత సాన్నిహిత్యం ఉందని క్రిస్ మార్టిన్ నవ్వుతూ వెల్లడించాడు. ఇదంతా సీరియస్ గా విన్నవారు 'సరదాకా?' అని నవ్వేశారు.

  • Loading...

More Telugu News