: వస్తు సేవల పన్ను బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రాలు, కేంద్రం సంయుక్తంగా గెలుపు, గెలిపించు పాలసీలో నడవాలని భావిస్తున్నామని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతోందని ఆయన స్పష్టం చేశారు. వస్తు సేవల పన్ను బిల్లుపై రాష్ట్రాల అభ్యంతరాలను కేంద్రం అర్థం చేసుకుందని ఆయన వివరించారు.