: 'రాచపాళెం'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డికి ఈ ఏటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 'మన నవలలు-మన కథానికలు' అనే పుస్తకానికి గానూ ఆయనకు ఉత్తమ విమర్శకుడిగా అవార్డు లభించింది. కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి అభ్యుదయ సాహిత్య రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన కలం నుంచి రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం జాలువారాయి. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించడంపై తెలుగు రచయితలు హర్షం వ్యక్తం చేశారు.