: కిమ్ కర్డాషియన్ లా మారేందుకు రూ.94 లక్షలు ఖర్చు చేశాడు!
బ్రిటన్ లోని మాంచెస్టర్ కు చెందిన జోర్డాన్ జేమ్స్ పార్కీ (23) అనే మేకప్ ఆర్టిస్టుకు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన అభిమాన టీవీ స్టార్, వరల్డ్ సెలబ్రిటీ కిమ్ కర్డాషియన్ లా మారితే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. అనుకున్నదే తడవుగా కార్యాచరణ మొదలుపెట్టాడు. రూ.94 లక్షలు ఖర్చు చేసి రూపురేఖలను మార్చుకున్నాడు. తన పెదవులు కర్డాషియన్ పెదవుల్లా కనిపించేందుకు లిప్ ఫిల్లర్లు వినియోగించాడు. లేజర్ హెయిర్ రిమూవల్, విల్లులాంటి కనుబొమ్మల కోసం ప్రత్యేక చికిత్స, కాంతులీనే చర్మం కోసం బొటాక్స్ ఇంజక్షన్లు... ఇలా కర్డాషియన్ ఫీచర్లన్నీ తనలో కనిపించేలా తయారయ్యాడు. దీనిపై, తన కొత్త అవతారంపై పార్కీ మాట్లాడుతూ, "నన్ను చూసి ప్రజలు ప్లాస్టిక్ ఫేస్ అని, నకిలీ ముఖం అని అవమానించేందుకు ప్రయత్నిస్తుంటే నవ్వొస్తుంది" అని తెలిపాడు. తన ప్రయత్నాలకు ఏమీ చింతించడంలేదని స్పష్టం చేశాడీ మేకప్ ఆర్టిస్టు.