: సోనియాకు ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్... క్షేమమే
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకిందని, వైద్యులు చికిత్స అందించారని తెలిపారు. ఆమె క్షేమంగానే ఉన్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని వివరించారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో నిన్న ఆమె అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. గతంలో సోనియా క్యాన్సర్ బారిన పడి, అమెరికాలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.