: ఏపీ అసెంబ్లీలో 'పులిహోర' గోల!


తుపాను ధాటికి విలవిలలాడుతూ, సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆహారాన్ని కనీసం చేతికి ఇవ్వకుండా విసిరేసారని వైకాపా అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. పులిహోర పొట్లాలను గాల్లోకి విసేరేసి వెళ్ళడం ఏ మాత్రం సమంజసమని ఆయన ప్రశ్నించారు. మీ ఇళ్ల ముందు ఇలాగే పులిహోర పొట్లాలు విసిరితే మీరు తీసుకుంటారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ సమయంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడి ప్రసంగం మరింత వేడిని రగిల్చింది. పోడియంలోకి సభ్యులు దూసుకు రావడంతో సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారు. అంతకుముందు ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ హుదూద్ తుపానుపై చర్చను చేపట్టాలని సభ్యులను కోరారు. ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ సీఎం సభలో లేనందున రేపు చర్చను చేపట్టాలని కోరారు. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, సీఎం విశాఖ పర్యటనలో ఉన్నారని, మరి కాసేపట్లో సభకు హాజరవుతారని, చర్చను కొనసాగించాలని సూచించారు. అనంతరం టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ చర్చను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News