: లఖ్వీ బెయిల్ ను సవాల్ చేస్తా: పాక్ ప్రభుత్వ న్యాయవాది ప్రకటన


ముంబై దాడుల సూత్రధారుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి మంజూరైన బెయిల్ ను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ పాకిస్థాన్ కోర్టులో దాఖలు కానుంది. పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రభుత్వ న్యాయవాది ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు. ముంబై దాడుల కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లఖ్వీకి పాక్ లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి జరిగిన మరునాడే లఖ్వీకి బెయిల్ మంజూరు కావడంపై భారత్ సహా పలు ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేశాయి. లఖ్వీ బెయిల్ పై భారత్ తన అసంతృప్తిని పాక్ కు తెలియజేసింది. అయినా పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాను మాత్రం లఖ్వీ బెయిల్ తీర్పును సవాల్ చేయనున్నట్లు ఆ దేశ ప్రభుత్వ న్యాయవాది ఒకరు ప్రకటించడం విశేషం.

  • Loading...

More Telugu News