: మంత్రి పదవి ఆశించి... చీఫ్ విప్ గా సర్దుకొని... బాధ్యతలు స్వీకరించిన కొప్పుల
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. విప్‌గా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొప్పుల ఈశ్వర్ కు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. ఒకదశలో తనకు మంత్రి పదవి రాలేదని కొప్పుల అలిగారు కూడా. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొప్పులకు మంత్రి పదవి ఇవ్వలేక పోయానని, మరో 6 నెలల్లో తగిన గుర్తింపు ఇస్తానని కేసీఆర్ నుంచి వచ్చిన హామీ మేరకు శాంతించిన ఆయన చీఫ్ విప్ గా నేడు బాధ్యతలు స్వీకరించారు.