: మళ్లీ పంజా విసిరిన బోకో హరామ్


నైజీరియాలో ఇటీవలే 200 మంది బాలికలను కిడ్నాప్ చేసిన బోకో హరామ్ మిలిటెంట్ గ్రూపు మరోమారు ఘాతుకానికి తెగబడింది. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని గుమ్సురి గ్రామంపై పెద్ద సంఖ్యలో దాడికి దిగిన మిలిటెంట్లు పెట్రోల్ బాంబులు విసిరి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో 32 మంది మృతి చెందారు. 185 మందిని కిడ్నాప్ చేశారు. అపహరణకు గురైన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ దారుణం ఆదివారం నాడు జరగ్గా, దాడి నుంచి తప్పించుకున్న కొందరు మైదుగురి పట్టణం చేరుకుని వివరాలు తెలపడంతో, ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, ఘటనకు తామే కారణమని బోకో హరామ్ ఇంతవరకు ప్రకటించలేదు. అధికారులు మాత్రం బోకో హరామ్ వైపే వేలెత్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News