: తమలపాకు తలుపుచెక్క మాటలొద్దు: స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైకాపా సభ్యుడు మాట్లాడుతూ, తెలుగుదేశం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తే, ప్రతిగా అసలు అవినీతికి ఆద్యుడే వైఎస్ అంటూ, అధికార పక్షం ప్రత్యారోపణలు చేసింది. సభలో గందరగోళం నెలకోవడంతో స్పీకర్ కల్పించుకొని "ఎంచుకున్న అంశాన్ని వీడకుండా విమర్శలు చేసుకోవచ్చు. కాని ఈ తమలపాకు తలుపుచెక్క మాటలొద్దు" అని తరువాతి ప్రశ్నకు వెళ్ళిపోయారు.