: తీహార్ జైలుపై ఆత్మాహుతి దాడి... హెచ్చరించిన నిఘావర్గాలు


అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తీహార్ జైలు వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో, జైలు వద్ద భద్రతను భారీగా పెంచారు. కాగా, తీహార్ జైలులో పలువురు కరడుగట్టిన ఉగ్రవాదులు ఉన్న సంగతి తెలిసిందే. వీరితోపాటు సహారా చీఫ్ సుబ్రతారాయ్ వంటి ప్రముఖులూ ఉన్నారు. గతంలోనూ పలుమార్లు తీహార్ జైలుపై దాడులు జరపాలని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేసి విఫలమైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News