: కాంగ్రెస్ చేసిందే కేసీఆర్ కూడా చేస్తున్నారు: బీజేపీ


మత పరమైన రిజర్వేషన్లు కల్పించరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేసి విఫలమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే తప్పును టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడే కొద్దీ తెలంగాణలో బీజేపీ బలపడుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ గెలవలేదని... కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే గెలుపొందిందని మురళీధర్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ ఎదుగుతోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని పోటీ దృష్టితో చూడటం లేదని... ఆ పార్టీ తమకు మిత్ర పక్షమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News