: పరారీలో విష్ణు... బెంగళూరులో ఉన్నట్టు సమాచారం!


కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ఆయన అంగరక్షకుడిపై జరిగిన దాడి కేసులో జూబ్లీహిల్స్ మాజీ ఎంఎల్ఏ విష్ణువర్ధన్ రెడ్డిని ఈరోజు ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నిన్న ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్ళగా, అప్పటికే విష్ణు తన రెండు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని తన స్నేహితుని వద్ద తలదాచుకున్నట్టు తెలుస్తోంది. కాగా, రంగారెడ్డి కోర్టులో విష్ణు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. విష్ణుకు బెయిల్ లభించకుంటే, ఆయన పరారీలో ఉన్నట్టు ప్రకటించి, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News