: ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్... రాణిస్తున్న భారత బౌలర్లు
బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టులోని ఆరుగురు బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ చేర్చిన భారత పేసర్లు, పదునైన బంతులను విసురుతున్నారు. మరోవైపు భారత బౌలర్లను దీటుగానే ఎదుర్కొంటున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒంటరి పోరు సాగిస్తున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా, అతడు మాత్రం సెంచరీ దిశగా నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం 62.3 ఓవర్లు ముగిసేసరికి ఆసిస్ 259 పరుగులు చేసింది. స్మిత్ 123 బంతుల్లో 83 పరుగులు రాబట్టాడు. మిచెల్ జాన్సన్ (6) రెండో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు.