: ఏపీకి రైల్వే జోన్ పై ప్రధానికి వివరిస్తాం: అవంతి శ్రీనివాస్


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ పార్లమెంటులో ప్రస్తావించామని ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో ఉందని అన్నారు. ఏపీలోని నాలుగు డివిజన్లను కలిపి వాల్తేరు డివిజన్ ను రైల్వే జోన్ గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ ను ఏపీలో ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే ఉద్యోగాలు, నిధులు, సౌకర్యాల్లో తమ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News