: ఐఎస్ఐఎస్ ట్విట్టర్ ఖాతాదారు బిశ్వాస్ కస్టడీ పొడిగింపు


ఇరాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తో ట్విట్టర్ ఖాతా కలిగి ఉన్న మెహిదీ బిశ్వాస్ కు పోలీస్ కస్టడీని పొగిడిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ కస్టడీని న్యాయస్థానం 15 రోజులు పొడిగించింది. కాగా, ఐఎస్ఐఎస్ సంధాన కర్తగా బిశ్వాస్ కీలక పాత్ర పోషించాడు. అతని కారణంగా భారత్ లో ఐఎస్ఐఎస్ కు సంబంధించిన వీడియోలు, వార్తలు వ్యాప్తి చెందేవి. వాటి కారణంగా ఎంతో మంది యువకులు ఉద్రేకానికి లోనై, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులయ్యారు. ఐఎస్ఐఎస్ కదలికలపై డేగ కన్ను వేసిన బ్రిటన్ హెచ్చరికలతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు అతనిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News