: ఆస్ట్రేలియా, భారత్ ప్రభుత్వాలకు, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విశ్వకాంత్
తనకు అండగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీ యాజమాన్యం, స్నేహితులు, సన్నిహితులు, ఆసీస్ ప్రజలకు ధన్యవాదాలని ఆస్ట్రేలియాలో తీవ్రవాదుల చేతుల్లోంచి బయటపడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విశ్వకాంత్ తెలిపారు. సిడ్నీలో ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా, భారత ప్రభుత్వాలకు కృతజ్ఞతలని అన్నారు. జరిగిన ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తనకు, తన కుటుంబానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని మాత్రం ఆయన మీడియాను కోరారు.