: చంద్రబాబుతో సుమిటోమో కార్పొరేషన్ సీఈవో భేటీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సింగపూర్ కు చెందిన ప్రముఖ కంపెనీ సుమిటోమో కార్పొరేషన్ సీఈవో కె.హీరారో సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 29 రకాల కంపెనీలు కలిగిన సుమిటోమో గ్రూప్ కెమికల్, మైనింగ్, మెటల్, ట్రేడింగ్, నిర్మాణ రంగాల్లో పేరు ప్రతిష్ఠలు కలిగిన కంపెనీ కావడం విశేషం. రాజధాని నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ లో పలు కారిడార్లు, క్లస్టర్ల నిర్మాణం, స్మార్ట్ సిటీల నిర్మాణం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యాపారవేత్తలను సాక్షాత్తూ సీఎం ఆహ్వానించడం నేపథ్యంలో సుమిటోమో కార్పొరేషన్ సీఈవో సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News