: 40 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత శిక్ష ఖరారు
రైల్వే మాజీ మంత్రి ఎల్ఎన్ మిశ్రా హత్యకేసులో ఢిల్లీ న్యాయస్థానం తుదితీర్పు వెలువరించింది. దివంగత ఎల్ఎన్ మిశ్రా హత్య కేసు నిందితులు నలుగురికి యావజ్జీవ కారాగారశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. 1975లో హత్యకు గురైన ఎల్ఎన్ మిశ్రా హత్య కేసులో 40 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుదితీర్పు వెల్లడించడం విశేషం.