: తలసానిని ఓడించాలంటూ కోదండరామ్ పిలుపునివ్వాలి: టీడీపీ
తెలంగాణ ద్రోహి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ లో చేర్చుకుని, మంత్రి పదవిని కట్టబెట్టారంటూ టీఎస్ సీఎం కేసీఆర్ పై టీటీడీపీ మండిపడింది. సనత్ నగర్ లో టీడీపీ తరపున గెలిచిన తలసాని... ఇప్పుడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారని... ఆయనను చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. శ్రీనివాస్ యాదవ్ ను ఓడించడానికి టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ముందుకు రావాలని... తెలంగాణ ఉద్యమ శక్తులన్నింటినీ ఏకం చేసి తలసానిని ఓడించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను ప్రభుత్వంలో చేర్చుకుంటున్న కేసీఆర్ కు సనత్ నగర్ ఉపఎన్నిక ఓ గుణపాఠం కావాలని అన్నారు.