: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్లను నిలిపి వేస్తూ గత సెప్టెంబరులో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ ఎమ్.ఎస్.రామచంద్రరావు ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. దీంతో, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి.