: ఉత్కంఠ పెడుతున్న పాత పెట్టె... రేపు తెరవాలని ఆదేశాలు
దాదాపు నెల రోజుల నుంచి ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన పాత ఇనుపపెట్టె రేపు తెరచుకోనుంది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పి.గన్నవరం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జోసెఫ్ తెలిపారు. గతనెల 17న నరేంద్రపురం గ్రామంలో ఓ పాడుబడిన ఇంటి శిథిలాలను తొలగిస్తున్న సమయంలో పాత ఇనుప పెట్టె ఒకటి బయటపడింది. ఆ పెట్టెను అధికారులు స్వాధీనం చేసుకొని పోలీసుల కస్టడీలో ఉంచారు. ఈ పెట్టెను తెరచి చూసేందుకు అనుమతి కోరగా, ఈ నెల 19న తెరిచేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.