: 'మిస్ ఇండియా యూఎస్ఏ'గా తెలుగమ్మాయి
ప్రవాస భారతీయురాలు ప్రణతి గంగరాజు 'మిస్ ఇండియా యూఎస్ఏ 2014' అందాల పోటీలో విజేతగా నిలిచింది. జార్జియాకు చెందిన ఈ 19 ఏళ్ల యువతి ప్రస్తుతం ఫిలిం యాక్టింగ్-ప్రొడక్షన్ కోర్సు అభ్యసిస్తోంది. ప్రణతి స్వస్థలం విజయవాడ. అందాల పోటీలో కిరీటం దక్కడంతో ప్రణతి కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమైంది. తండ్రి రామ్ గంగరాజు మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రణతి మాట్లాడుతూ, తాను తెలుగు సినిమాలు చూస్తానని, అవకాశాలు వస్తే నటిస్తానని తెలిపింది. టైటిల్ సాధనలో కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారని పేర్కొంది.