: బిగ్ బీ అమితాబ్... ట్విట్టర్ ఫాలోయింగ్ లోనూ సూపర్ స్టారే!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపైనా సూపర్ స్టార్ గా నిరూపించుకున్నారు. తాజాగా ఆయన సోషల్ నెట్ వర్క్ ఫాలోయింగ్ లోనూ తిరుగులేని నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్ కు 1.2 కోట్ల మంది ఫాలోయర్లున్నారు. తద్వారా ట్విట్టర్ లో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లున్న నటుడిగా ఆయన ఖ్యాతిగాంచారు. ‘టు ద న్యూ’ అనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఈ మేరకు బిగ్ బీకి వెల్లువెత్తిన నెటిజన్ల అభిమానాన్ని వెల్లడి చేసింది. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా గా పేరుగాంచిన షారుఖ్ ఖాన్ (1.04 కోట్లు) రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (54 లక్షలు) కొనసాగుతున్నాడు. ఇక నటీమణుల విషయానికొస్తే ప్రియాంకా చోప్రా 80 లక్షల మంది ఫాలోయర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దీపికా పదుకొనే ఆమె తర్వాతి స్థానంలో ఉంది. మొత్తం ఫాలోయర్లు, రోజుకు పెరుగుతున్న ఫాలోయర్ల సంఖ్య, వారి ట్వీట్ల సంఖ్యలను ఆధారం చేసుకుని ఈ జాబితా రూపొందింది.