: నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... 208/4
బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద షాన్ మార్స్ ఔట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 121 పరుగులకు ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో... స్మిత్ తో కలసి షాన్ మార్స్ 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 60 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కు మిచెల్ మార్స్ జతకలిశాడు. ఈ రోజు ఆటలో మరో 13 ఓవర్లు మిగిలి ఉన్నాయి.