: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి విరాళమిచ్చిన నైవేలీ లిగ్నైట్
ఏపీలోని ఉత్తరాదిని అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించింది. నేటి ఉదయం సీఎం చంద్రబాబునాయుడుతో నైవేలీ లిగ్నైట్ సీఎండీ సుధీర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ తరఫున ఆయన రూ.1 కోటి విరాళానికి సంబంధించిన చెక్కును చంద్రబాబుకు అందజేశారు. భేటీ సందర్భంగా సుధీర్, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం.