: రాహుల్ తో ముగిసిన సీఎం, బొత్స భేటీ


కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల సమావేశం ఈ సాయంత్రం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాం నబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు. గంటపాటు సాగిన ఈ ప్రత్యేక సమావేశంలో ప్రధానంగా పార్టీ వ్యవహారాలు, కళంకిత మంత్రులపై చర్య వంటి విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తనకంటూ కొంత ప్రత్యేక సమాచారాన్ని రాహుల్ తెప్పించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఇటీవల కాలంలో సోనియా, రాహుల్ వంటి అగ్రనేతలతో జరిగిన కీలక సమావేశమిదే. భేటీ విషయమై పీసీసీ చీఫ్ బొత్స మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేసే విషయంపైనా, స్థానిక సంస్థల ఎన్నికలపైనా రాహుల్ సమీక్షించారని చెప్పారు.

  • Loading...

More Telugu News