: మరో ఐదేళ్లలో అంతరిక్షంలోకి వ్యోమగాములు: ఇస్రో


భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం అయింది. ఒక్కో దశను దాటుకుంటూ వెళ్లిన రాకెట్ 20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంది. వ్యోమగాముల గదిని మార్క్-3 తనతో పాటు 125 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్లి వదిలేసింది. ఈ క్రూ మాడ్యూల్ లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించే వీలుంటుంది. అనంతరం, క్రూ మాడ్యూల్ ను రిమోట్ కంట్రోల్ ద్వారా భూ వాతావరణం లోకి తీసుకొచ్చారు. భారీ ప్యారాచూట్ల సాయంతో దాని వేగాన్ని నియంత్రించి నెమ్మదిగా బంగాళాఖాతంలోకి చేర్చారు. దీంతో, అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపాలన్న భారత్ చిరకాల స్వప్నంలో... తొలి అంకం విజయవంతంగా ముగిసింది. మరో ఐదేళ్లలో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సిద్ధమవుతున్నామని ప్రయోగం అనంతరం ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News