: మరోసారి భారత్ లో ప్రవేశించిన చైనా బలగాలు


చైనా బలగాలు మరోసారి భారత్ లో ప్రవేశించాయి. లడఖ్ ప్రాంతంలోని చుషూల్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు చొచ్చుకువచ్చారు. ఈ ప్రాంతంలో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చైనా సైనికుల చొరబాటుతో భారత ఆర్మీ అప్రమత్తమైంది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీంతో, చైనా బలగాలు వెనుదిరిగాయి. గత సెప్టెంబరులో ఓసారి చైనా బలగాలు భారత్ లోకి వచ్చాయని, అప్పుడు సరిహద్దుకు ఇరువైపులా భారత్, చైనా ప్రజల మధ్య వివాదం రేగిందని, ఆ గొడవ తీవ్రతరం కాగానే తమ ప్రజలకు దన్నుగా చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఈ చొరబాట్లు సాధారణమైపోయాయని, వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత బలగాలు దీటుగా స్పందిస్తున్నాయని హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News