: ఇండియాపై భీకర దాడులు: హఫీజ్ సయీద్
ఇండియాపై ఉగ్ర దాడులు చేస్తామని లష్కర్ ఎ తోయిబా అధినేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్న హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. పాకిస్తాన్ సైనిక పాఠశాలపై తాలిబాన్ల దాడి వెనుక భారత్ హస్తముందని ఆయన ఆరోపించాడు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నాడు. కాగా, 2008లో ముంబైపై జరిగిన ఉగ్ర దాడికి వ్యూహం పన్నిన హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. పాకిస్తాన్ సైన్యాధికారుల సహకారంతో దర్జాగా తిరుగుతున్న హఫీజ్ ను ఒక మత గురువని ఆ దేశ ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.