: తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్... 29 పరుగులకే వార్నర్ ఔట్
బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ ను కోల్పోయింది. తొలి టెస్టులో శతకాలతో భారత బౌలర్లను బెంబేలెత్తించిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (29), రెండో టెస్టులో విఫలమయ్యాడు. వచ్చీరాగానే టీమిండియా బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్ కేవలం 28 బంతుల్లోనే 29 పరుగులు సాధించాడు. అయితే, ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అశ్విన్ పట్టిన క్యాచ్ తో వార్నర్ భారీ స్కోరు సాధించకుండానే పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. వార్నర్ వెనుదిరగడంతో షేన్ వాట్సన్ క్రీజులోకి వచ్చాడు.