: మరికొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు... అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న శీతాకాల సమావేశాల్లో వైరివర్గాలను ఇరుకున పెట్టేందుకు అధికార, విపక్షాలు ఇప్పటికే వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. తొలి రోజు సమావేశాల్లో భాగంగా, ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణకు నివాళి అర్పించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడనుంది. సమావేశాల ప్రారంభానికి ముందు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ సభా వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలోనూ అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.