: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం... బూడిదైన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్


తిరుపతిలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలో కొనసాగుతున్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. నగరంలోని తీర్థకట్ట వీధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఒక్కసారిగా షాపింగ్ మాల్ ను చుట్టుముట్టిన మంటలు క్షణాల్లో భవనాన్ని దహించివేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు దాదాపుగా 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో భవనంతో పాటు అందులోని చందన బ్రదర్స్ గార్మెంట్స్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమిక సమాచారం.

  • Loading...

More Telugu News