: రామయ్య సేవకు తుమ్మల... సరస్వతి దేవి వద్దకు ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఇద్దరు కొత్త మంత్రులు నేడు తమ ఇష్ట దైవాలను దర్శించుకోనున్నారు. ఖమ్మం జిల్లా సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరడం, వెనువెంటనే ఆయనను మంత్రి పదవి వరించడం తెలిసిందే. తన ఆకాంక్ష నెరవేరిన నేపథ్యంలో, ఆయన నేడు జిల్లాలోని భద్రాచలంలో కొలువైన రామయ్యకు ప్రత్యేక పూజలు చేసేందుకు వెళుతున్నారు. మరోవైపు, దాదాపు 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండటమే కాక ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఎట్టకేలకు కేసీఆర్ కేబినెట్ లో బెర్తు దొరికింది. తన సుదీర్ఘ కల నెరవేరిన నేపథ్యంలో నేడు ఆయన తన ఇష్టదైవం సరస్వతి మాతను దర్శించుకోనున్నారు. నేడు బాసర వెళ్లనున్న ఇంద్రకరణ్ రెడ్డి అక్కడి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.